ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

US: కాలిఫోర్నియాలో చిన్న విమానం Crash...ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-10-12T12:44:11+05:30

అమెరికాలో చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

California (యూఎస్): అమెరికాలో చిన్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాలిఫోర్నియా నగరంలోని శాన్ డియాగో శివారులోని శాంటీ ప్రాంత నివాసాలపై చిన్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో రెండు ఇళ్లు, పలు వాహనాలు దగ్ధం అయ్యాయి.నివాసాల మధ్య ఇద్దరి మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది కనుగొన్నారు.ఈ ఘటనలో డెలివరీ ట్రక్కు కాలిపోయింది.ఫాక్స్ 5 శాన్ డియాగో ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానం అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మరణించారని అగ్నిమాపకశాఖ అధికారి జస్టిన్ మత్సుషిత చెప్పారు.


విమానం కూలిపోతున్నపుడు ఇళ్లలోని వారు చూసి పరుగులు తీశారు.ఈ దుర్ఘటనలో శాంటీ నగరంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.విమానం కుప్పకూలినపుడు అందులో ఎంతమంది ప్రయాణికులున్నారో ఇంకా తెలియలేదు.విమానం కూలిన ప్రాంతం సమీపంలో సంతన హైస్కూల్ ఉందని,అదృష్టవశాత్తు విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని స్కూలు యాజమాన్యం ట్వీట్ చేసింది.గత నెలలో ఇద్దరు యూఎస్ మిలటరీ పైలెట్లు నడుపుతున్న శిక్షణ విమానం టెక్సాస్ లో ఫోర్ట్ వర్త్ సమీపంలోని నివాస ప్రాంగణంలో కూలిపోవడం పలువురు గాయపడ్డారు.


Updated Date - 2021-10-12T12:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising