ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ ఖాతా హ్యాకింగ్‌పై ట్విటర్ స్పందన

ABN, First Publish Date - 2021-12-12T16:25:52+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కాసేపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కాసేపు హ్యాకింగ్‌కు గురికావడంపై ట్విటర్ ఆదివారం స్పందించింది. ఈ ఖాతాను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రధాన మంత్రి కార్యాలయంతో తమకు నిరంతర కమ్యూనికేషన్ సదుపాయం ఉందని, ఆయన ట్విటర్ హ్యాండిల్‌పై దాడి జరిగినట్లు తెలిసిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకున్నామని ట్విటర్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మోదీ ట్విటర్ ఖాతాపై దాడి జరిగిన సమయంలో ఇతర ఖాతాలపై ప్రభావం పడినట్లు ఎటువంటి సంకేతాలు అందలేదన్నారు. 


మోదీ ట్విటర్ హ్యాండిల్ ఆదివారం కొద్ది సేపు హ్యాకింగ్‌కు గురైంది. బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా వినియోగించేందుకు భారత దేశం అధికారికంగా ఆమోదం తెలిపిందని ఓ ట్వీట్ ఈ ఖాతా నుంచి వచ్చింది. దీంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విటర్‌కు సమాచారం అందించింది. కాసేపటి తర్వాత ఈ ఖాతా పునరుద్ధరణ జరిగిందని పీఎంఓ ప్రకటించింది. హ్యాకింగ్‌కు గురైన సమయంలో వచ్చిన ట్వీట్లను పట్టించుకోవద్దని కోరింది.


బిట్‌కాయిన్‌ను చట్టబద్ధంగా వినియోగించేందుకు భారత దేశం అధికారికంగా ఆమోదం తెలిపిందనే ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసి చాలామంది యూజర్లు షేర్ చేశారు. క్రిప్టోకరెన్సీలపై బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. తప్పుడు వాగ్దానాలతో పెట్టుబడులను ఆకర్షించేందుకు క్రిప్టోకరెన్సీలను ఉపయోగించుకుని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను మళ్ళించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 


Updated Date - 2021-12-12T16:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising