ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'సీఎంని కాదు పీఎంని మార్చాలి'

ABN, First Publish Date - 2021-09-12T20:43:19+05:30

దేశంలోని పేదరికం, నిరుద్యోగం మార్చడానికి బదులు సీఎంలను మారుస్తున్నరని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘గడిచిన 6 నెలల్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చారు. ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్, కర్ణాటకలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంపై భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సెటైర్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చాల్సింది ముఖ్యమంత్రిని కాదని ప్రధానమంత్రిని అంటూ నెట్టింట్లో హడావుడి చేస్తున్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను, ఏడేళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపుతూ మోదీని రాజీనామా చేయమంటూ కొందరు డిమాండ్ చేశారు. ‘‘సీఎం నహీ పీఎం బదలో’’ (సీఎంను కాదు పీఎంను మర్చండి) అనే అర్థంలో ట్విట్టర్ ట్రెండ్ సృష్టించారు.


దేశంలోని పేదరికం, నిరుద్యోగం మార్చడానికి బదులు సీఎంలను మారుస్తున్నరని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘గడిచిన 6 నెలల్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చారు. ఉత్తరాఖండ్‌లో త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రావత్, కర్ణాటకలో యడియూరప్ప, గుజరాత్‌లో విజయ్ రూపానీ. ఇంత మందిని మార్చి ఏం లాభం లేదు. ముందు మార్చాల్సింది ప్రధానమంత్రిని’’ అని ఓ నెటిజెన్ ట్వీట్ చేశారు. ఇక కొందరైతే ‘‘గుజరాత్ ఎన్నికలకు యేడాదికి పైగానే సమయం ఉంది. కానీ, మోదీ-షా అప్పుడే తొందరపడుతున్నారు. రైతులు కొన్ని నెలలుగా నిరసన చేస్తున్నారు. కానీ వారి గురించి ఒక్కసారి కూడా ఆలోచించరు’’ అని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.



















Updated Date - 2021-09-12T20:43:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising