ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai:బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కరోనా

ABN, First Publish Date - 2021-08-27T12:48:12+05:30

మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ప్రారంభమైందా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ప్రారంభమైందా అంటే అవునంటున్నారు వైద్యనిపుణులు...ముంబై నగరంలోని అగ్రిపదలోని బోర్డింగ్ స్కూలులో 26 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలులో ఉన్న 95 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 26 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. కరోనా సోకిన పిల్లల్లో నలుగురు 12 ఏళ్ల లోపు వయసు వారున్నారు.కరోనా సోకిన నలుగురు పిల్లలను నాయర్ ఆసుపత్రికి తరలించారు. 12 ఏళ్ల వయసు పైబడి కరోనా సోకిన 22 మంది బోర్డింగ్ స్కూలు విద్యార్థులను రిచర్డ్ సన్ క్వారంటైన్ సెంటరుకు తరలించారు.


కరోనా వ్యాప్తితో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సెయింట్ జోసెఫ్ బోర్డింగ్ స్కూలుకు సీలు వేశారు. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 720 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు.వీరిలో 686 మంది పిల్లలు బాలల షెల్టర్ హోంలలో ఉన్నవారే కావడం విశేషం. హర్యానాలో అత్యధికంగా 288 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. తమిళనాడులో 149 మంది, బిహార్ లో 131 మంది పిల్లలు కొవిడ్ తో చికిత్స పొందుతున్నారు.

 

Updated Date - 2021-08-27T12:48:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising