ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtraలో జెనోమిక్ సీక్వెన్సింగ్ కోసం 28 మంది అంతర్జాతీయ ప్రయాణికుల శాంపిళ్లు

ABN, First Publish Date - 2021-12-03T15:32:27+05:30

మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన 28 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికుల శాంపిళ్లను కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ అనుమానంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరానికి చెందిన 28 మంది అంతర్జాతీయ విమాన ప్రయాణికుల శాంపిళ్లను కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ అనుమానంతో జెనోమిక్ సీక్వెన్సింగ్ పరీక్ష కోసం ల్యాబ్ కు పంపించారు. మహారాష్ట్రలో గురువారం వరకు 861 మంది అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించగా, వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. మొత్తంమీద మహారాష్ట్రలో 796 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 7,209 కాగా 24 మంది మరణించారు. రాయగఢ్ నగరంలో అత్యధికంగా 12 మంది కరోనాతో కన్నుమూశారు. నవంబరు 1వతేదీ నుంచి ముంబైకు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికులపై ఆరోగ్యశాఖ అధికారులు నిఘా వేశారు. 


విమానాశ్రయంలో సేకరించిన 28మంది నమూనాలను పూణేలోని ఎన్‌ఐవీ,  ముంబైలోని కస్తూర్బా హాస్పిటల్ ల్యాబోరేటరీకి పంపించారు. కరోనా కేసులు తగ్గాక మహారాష్ట్రలో ఆంక్షలను సడలించారు. ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తితో పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ ప్రయాణికులు కొవిడ్ టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరారు.


Updated Date - 2021-12-03T15:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising