ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూత్తుకుడి కాల్పుల ఘటన.. 30 మందికి సమన్లు

ABN, First Publish Date - 2021-10-22T12:59:34+05:30

తూత్తుకుడి తుపాకీ కాల్పుల ఘటనకు సంబంధించిన 31వ విడత విచారణను మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్‌ ప్రారంభించారు. తహసీల్దార్‌, వైద్యులు తదితర 30 మంది విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(Chennai): తూత్తుకుడి తుపాకీ కాల్పుల ఘటనకు సంబంధించిన 31వ విడత విచారణను మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్‌ ప్రారంభించారు. తహసీల్దార్‌, వైద్యులు తదితర 30 మంది విచారణకు హాజరుకావాలని సమన్లు జారీచేశారు. తూత్తుకుడిలో గత 2018లో స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతిచెందారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తి అరుణా జగదీశన్‌ నేతృత్వంలోని కమిషన్‌ విచారణ చేపట్టింది. ఇప్పటికే 30 విడతలుగా 962 మందిని విచారించారు. ఈ నేపథ్యంలో, కమిషన్‌ 31వ విడత విచారణ తూత్తుకుడి ప్రభుత్వ అతిథిగృహం ప్రాంగణంలోని కమిటీ కార్యాలయంలో ప్రారంభమైంది. తుపాకీ కాల్పుల సమయంలో విధుల్లో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఘటనలో మృతిచెందిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, వేలిముద్రల నిపుణులు, తుపాకీ కాల్పులకు ఆదేశించిన తహసీల్దార్లు అని మొత్తం 30 మందికి సమన్లు జారీచేశారు. ఈ విచారణ ఈనెల 26వ తేదీ వరకు కొనసాగుతుందని కమిషన్‌ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-22T12:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising