ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎంసీకి మరోషాక్: ఎన్నికలకు ముందే ఎంపీ, నటి నుస్రత్ జహాన్‌కు కరోనా పాజిటివ్!

ABN, First Publish Date - 2021-03-01T13:56:33+05:30

ప్రముఖ బెంగాల్ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రముఖ బెంగాల్ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయం వెల్లడికాగానే ఆమె పాల్గొనబోయే అన్ని సమావేశాలను, కార్యక్రమాలను రద్దుచేశారు. నుస్రత్‌కు కరోనా సోకడం బెంగాల్ ఎన్నికలపై ప్రభావం చూపనుందని పార్టీ భావిస్తోంది. మరోవైపు నుస్రత్ ఫాన్స్ తమ అభిమాన నటికి కరోనా సోకడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఆమె త్వరగా కోలుకోవాలని అభిలషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నుస్రత్ జహాన్ అటు సినీరంగంలో ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవలి కాలంలో ఆమె బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. కాగా నుస్రత్ నటించిన బెంగాలీ సినిమా ‘డిక్షనరీ’ ఈనెల 12న విడుదలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ తన ఫొటోలను షేర్ చేస్తుంటారు. నుస్రత్ ఆమధ్య నిఖిల్ జైన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. ఇది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2021-03-01T13:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising