ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విటర్‌కు ఝలకిచ్చిన టర్కీ..!

ABN, First Publish Date - 2021-01-20T01:51:57+05:30

ట్విటర్‌కు టర్కీ భారీ ఝలకిచ్చింది. ఇకపై ఎటువంటి ప్రకటనలు తీసుకోవద్దంటూ నిషేధం విధించింది. టర్కీ ఇటీవల తెచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయడంలో ట్విటర్ విఫలమైందని భావించిన ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంకారా: ట్విటర్‌కు టర్కీ భారీ ఝలకిచ్చింది. ఇకపై ఎటువంటి ప్రకటనలు తీసుకోవద్దంటూ నిషేధం విధించింది. టర్కీ ఇటీవల తెచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయడంలో ట్విటర్ విఫలమైందని భావించిన ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌తో పాటు దాని పింటెరెస్ట్, పెరిస్కోప్‌కు కూడా ఈ నిషేధం వర్తించనుంది. టర్కీలోకి కొత్త సోషల్ మీడియా చట్టం ప్రకారం.. సామాజిక మాధ్యమాలన్నీ స్థానికుడైన ఓ ప్రతినిధిని నియమించుకోవాల్సి ఉంటుంది. విషపు ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లను అన్నింటినీ ఈ ప్రతినిధి తొలగించాలి. అయితే..ఫేస్‌బుక్  కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం తాత్సారం చేస్తుండటంతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. 


ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్, యూట్యూబ్ ,ట్విటర్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి భారీ జరిమానాలు చెల్లించుకున్నాయి.  టర్కీలో ఎధేచ్చగా చట్ట ఉల్లంఘలనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా టర్కీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే..ప్రజావ్యతిరేకతను తొక్కిపట్టేందుకు టర్కీ ప్రభుత్వం ఇటువంటి  వైఖరి అవలంబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమీడియాను కట్టడి చేయడంలో సఫలీకృతం అయిన ప్రభుత్వం ప్రస్తుతం సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-01-20T01:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising