ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యలో పెళ్లి ఆపిన త్రిపుర డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్‌పై సస్పెన్షన్ వేటు

ABN, First Publish Date - 2021-05-03T19:16:53+05:30

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని వివాహాన్ని ఆపివేసిన త్రిపుర వెస్ట్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ పై సర్కారు సస్పెన్షన్ వేటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తలా (త్రిపుర): కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని వివాహాన్ని ఆపివేసిన త్రిపుర వెస్ట్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ పై సర్కారు సస్పెన్షన్ వేటు విధించింది. త్రిపుర వెస్ట్ డిస్ట్రిక్టు మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్ అగర్తలా నగరంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని పెళ్లి తంతును నిలిపివేశారు. పెళ్లితంతు నిలిపివేసిన జిల్లా మెజిస్ట్రేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పెళ్లిని ఆపిని జిల్లా మెజిస్ట్రేటుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు త్రిపుర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో మధ్యలో పెళ్లిని ఆపిన అధికారి యాదవ్ ను సస్పెండ్ చేస్తూ త్రిపుర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సీఎం దేబ్ ఆదేశాల మేరకు ఇద్దరు సీనియర్ అధికారులతో దర్యాప్తు జరిపి డీఎంపై వేటు వేశారు. పెళ్లితంతు సాగుతుండగా వధూవరులు, వారి కుటుంబసభ్యులు, అతిథులను వెంటనే బయలుదేరి వెళ్లి పోవాలని యాదవ్ వీడియోలో కోరారు.డీఎం కార్యాలయం వివాహానికి జారీ చేసిన అనుమతి పత్రాన్ని సమర్పించిననా దాన్ని యాదవ్ చించివేయడం వీడియోలో కనిపించింది. 


Updated Date - 2021-05-03T19:16:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising