ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుస్మిత దేవ్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన టీఎంసీ

ABN, First Publish Date - 2021-09-14T23:30:05+05:30

పార్టీ తీర్థం పుచ్చుకుని నెల రోజులు కూడా కాకముందే మాజీ ఎంపీ సుస్మిత దేవ్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ తృణమూల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పార్టీ తీర్థం పుచ్చుకుని నెల రోజులు కూడా కాకముందే మాజీ ఎంపీ సుస్మిత దేవ్‌ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అసోంలోని సిల్చార్‌ మాజీ ఎంపీ అయిన సుస్మిత దేవ్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి మమత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీలో చేరారు. ఆ సమయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజాసేవలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కాగా, సుస్మితను పార్లమెంటులోని ఎగువ సభకు నామినేట్ చేస్తుందుకు సంతోషిస్తున్నామని ఈ ఉదయం టీఎంసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 


తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై స్పందించిన సుస్మిత.. తనకు ఈ అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీఎంసీ ఎంపీ మనాస్ రంజన్ భునియా రాజీనామా చేసి మమత కేబినెట్‌లో మంత్రిగా చేరడంతో ఈ స్థానం ఖాళీగా కాగా, ఇప్పుడు దానిని సుస్మితతో భర్తీ చేశారు. 

Updated Date - 2021-09-14T23:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising