ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన హక్కుల ఉద్యమకారుడు స్టాన్‌స్వామి కన్నుమూత

ABN, First Publish Date - 2021-07-06T08:11:03+05:30

భీమా-కోరేగావ్‌ హింసకు సంబంధించిన ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడు, ఝార్ఖండ్‌ లో గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి(84) తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎల్గార్‌ పరిషత్‌ కేసులో 9 నెలలుగా జైల్లో.. 
  • నెల క్రితం కొవిడ్‌ బారిన పడ్డ స్టాన్‌స్వామి
  • శనివారం గుండెపోటు రావడంతో వెంటిలేటర్‌పైకి
  • పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస
  • సర్కారు మానవత్వం ప్రదర్శించలేదు: రాహుల్‌


న్యూఢిల్లీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): భీమా-కోరేగావ్‌ హింసకు సంబంధించిన ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితుడు, ఝార్ఖండ్‌ లో గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌ స్వామి(84) తుదిశ్వాస విడిచారు. ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు గత ఏడాది అక్టోబరులో ఉపా చట్టం కింద అరెస్టు చేశారు. ‘‘నేను భీమా-కోరేగావ్‌కు వెళ్లనే లేదు. అలాంటిది నాపై కేసేంటి’’ అని ఎన్‌ఐఏను ప్రశ్నించారు. ముంబైలోని తలోజా జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన ప్రతి చిన్న అవస రం కోసం న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఒక సిప్పర్‌, స్ట్రా తీసుకోవడానికి కూడా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. జైలులో వసతు లు సరిగ్గా లేవని, కొవిడ్‌ విజృంభిస్తున్నా.. వంటశాల సిబ్బంది కరోనా బారిన పడ్డా జైలు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ కోర్టుకు, జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్చార్సీ)కి ఫిర్యాదు చేశారు. తన వయసు 84 సంవత్సరాలని, అయినా.. తనకు జైలు అధికారులు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించలేదని పేర్కొన్నారు. మే 28న ఆయన కొవిడ్‌ బారిన పడ్డారు. కోర్టు అనుమతితో హోలీఫ్యామిలీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. మధ్యంతర బెయిల్‌ కోసం బాంబే హైకోర్టులో న్యాయపోరాటాన్ని కొనసాగించారు. కొవిడ్‌ తగ్గినా ఆయన ఆరోగ్యం క్షీణించింది. శనివారం తన బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 6కు వాయిదా వేసిందని తెలియగానే గుండెపోటుకు గురయ్యారు. ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ తగ్గిపోవడం, శ్వాస పీల్చుకోలేని పరిస్థితికి చేరుకోవడంతో శనివారం సాయంత్రం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. కొవిడ్‌ వల్ల పల్మనరీ ఇన్ఫెక్షన్‌, పార్కిన్సన్‌, కొవిడ్‌ తదనంతర పరిణామాలు ఆయన మరణానికి కారణమని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ డిసౌజా బాంబే హైకోర్టుకు తెలిపారు.

 

బెయిల్‌పై విచారణ ప్రారంభమయ్యేలోగా..

స్టాన్‌ స్వామి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బెయిల్‌ విచారణను అత్యవసరంగా చేపట్టాలని కోరుతూ ఆయన తర ఫు న్యాయవాదులు సోమవారం ఉదయం బాంబే హైకోర్టును కోరారు. మధ్యాహ్నం కోర్టు విచారణ ప్రారంభించేలోపే కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం విషయంలో ఎన్‌ఐఏ, జైలు అధికారుల నిర్లక్ష్యం ఉందని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని స్టాన్‌ స్వామి తరఫు న్యాయవాది దేశాయ్‌ కోర్టును కోరారు. స్టాన్‌ స్వామి క్రైస్తవ మతపెద్ద కావడం.. ఆయనకు కుటుంబం లేకపోవడంతో ఆయన మృతదేహాన్ని ఫాదర్‌ ఫ్రాజర్‌ మాస్కరెన్హా్‌సకు అప్పగించాలని కోర్టు ఆదేశిం చింది. ఆయన అంత్యక్రియలను కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం ముంబైలోనే నిర్వహించాలని సూచించింది


పలువురి సంతాపం 

స్టాన్‌ స్వామి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘స్టాన్‌ స్వామికి పట్ల న్యాయం, మానవత్వం ప్రదర్శించలేదు’’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు. ఆయన మరణాన్ని పోలీసు కస్టడీలో చావుగా పరిగణించాలని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. కస్టడీలో మరణించడం అన్యాయమని కేరళ సీఎం పినరయి విజయన్‌ అన్నారు. ఆయన మరణానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అన్నారు. ఈ విషాదానికి భారత ప్రభుత్వంలో ఎవరు బాధ్యులు? అని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. స్టాన్‌ స్వామి మృతిపట్ల ఐరోపా యూనియన్‌ మానవ హక్కుల విభాగం ప్రత్యేక ప్రతినిధి ఎమోన్‌ గిల్మోర్‌, ఐరాసలో మానవ హక్కుల విభాగం ప్రత్యేక రిపోర్టర్‌ మేరీ లాలోర్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.


ఉపాపై పోరాటం.. అదే చట్టం కింద అరెస్టు

తమిళనాడులోని త్రిచిలో జన్మించిన స్టాన్‌ స్వామి 1970లో యూనివర్సిటీ ఆఫ్‌ మనీ లాలో సామాజిక శాస్త్రంలో పీజీ పూర్తిచేశారు. బ్రసెల్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ సమయంలో అక్కడి ఆర్చిబిషప్‌ హోల్డర్‌ కమరాతో కలిసి పనిచేశారు. బెంగళూరులో క్రైస్తవ మతపెద్దల ఆధ్వర్యంలో నడిచే సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. 5 దశాబ్దాలపాటు గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని(ఉపా) రద్దు చేయాలని ఉద్యమించారు. చివరకు అదే చట్టం కింద జైలుకెళ్లి చనిపోయారు.

Updated Date - 2021-07-06T08:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising