ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలేష్‌ యాదవ్‌కు Transgender శాపం

ABN, First Publish Date - 2021-11-18T01:05:49+05:30

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ట్రాన్స్‌జెండర్ లీడర్ సోనం శాపం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు ట్రాన్స్‌జెండర్ లీడర్ సోనం శాపం పెట్టింది. అఖిలేష్ ఈ జన్మలో సీఎం కాలేడని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా సోనంను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుధవారంనాడు నియమించింది. తాజా నియామకంతో ఆమెకు మంత్రి స్థాయి హోదా లభిస్తుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పింది. ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్‌కు శాపం పెట్టింది. ''అఖిలేష్ తన జీవితంలో ఎప్పటికీ అధికారంలోకి రాడు. ఇది నా శాపం''అని సోనం తేల్చేసింది.


వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో రెండోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తిచూపుతూ అధికారం సొంతం చేసుకునేందుకు అఖిలేష్ యాదవ్ వరుస యాత్రలతో ప్రచారం సాగిస్తున్నారు. ఆప్ సైతం మరిన్ని సీట్లపై కన్నేయగా, యూపీలో తమ పార్టీకున్న గత ప్రాభవాన్ని తిరిగి తీసుకురావాలని ప్రియాంక గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది.

Updated Date - 2021-11-18T01:05:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising