ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్లతో పార్లమెంటుకు మార్చ్ : టికాయత్

ABN, First Publish Date - 2021-11-24T17:43:08+05:30

ఈనెల 29వ తేదీన 60 ట్రాక్టర్లతో పార్లమెంటు వరకూ మార్చ్ నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌషంబి: ఈనెల 29వ తేదీన 60 ట్రాక్టర్లతో పార్లమెంటు వరకూ మార్చ్ నిర్వహించనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయత్ బుధవారంనాడు తెలిపారు. పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత కల్పించడం సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఈ ట్రాక్టర్స్ మార్చ్ నిర్వహంచనున్నట్టు చెప్పారు. ప్రభుత్వం తెరిచి ఉంచిన రోడ్ల మీదుగానే ట్రాక్టర్లు పార్లమెంటు వరకూ వెళ్తాయన్నారు. ''మేము రోడ్లు దిగ్బంధం చేస్తున్నామనే ఆరోపణలకు తావీయం. రోడ్లు దిగ్బంధించడం మా ఉద్యమం కాదు. ప్రభుత్వంతో చర్చించడమే మా ఉద్యమం ఉద్దేశం. మేము నేరుగా పార్లమెంటుకు వెళ్తాం'' అని రాకేష్ టికాయత్ తెలిపారు. సుమారు వెయ్యి మంది వరకూ పార్లమెంటుకు వెళ్తున్నట్టు ఆయన చెప్పారు.


కనీస మద్దతు ధరపై ప్రభుత్వ స్పందన గురించి వేచిచూస్తున్నామని, దానికి తోడు ఏడాదిగా సాగించిన రైతు నిరసనల్లో 750 వరకు రైతులు చనిపోవడానికి కేంద్రం బాధ్యత తీసుకోవాలని టికాయత్ అన్నారు. వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారంనాడు సమావేశం కానున్న తరుణంలో టికాయత్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2021-11-24T17:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising