ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా ఆంక్షల సడలింపుతో సిమ్లాలో పర్యాటకుల సందడి

ABN, First Publish Date - 2021-06-14T11:32:00+05:30

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఆంక్షలను సడలించడంతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సిమ్లాలో పర్యాటకులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఆంక్షలను సడలించడంతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన సిమ్లాలో పర్యాటకులు పోటెత్తారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులు సందర్శించవచ్చిన కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. కరోనా ప్రభావం వల్ల కేవలం ఇంటికే పరిమితమైన ప్రజలు ఆంక్షల సడలింపుతో పర్యాటక ప్రాంతాల సందర్శనకు తరలివస్తున్నారు. కరోనా కర్ఫ్యూను ఎత్తివేయడంతో పాుట సెక్షన్ 144 ను ఎత్తివేశారు. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన పనిలేదని సర్కారు ప్రకటించింది. 


దీంతో సిమ్లా సందర్శన కోసం పర్యాటకులు పెద్ద సంఖ్యలో  తరలివచ్చారు. దీంతో పర్యాను వద్ద వేలాది వాహనాలు నిలిచిపోయాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కొవిడ్ ఈ పాస్ లు తీసుకొని వచ్చారు. వేసవి తాపం నుంచి విరామం కోసం పర్యాటకుుల కొండలపైకి వెళుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి 50 శాతం ఆక్యుపెన్సీతో ప్రయాణికుల రాకకు అనుమతించారు. దీంతోపాటు దుకాణాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరచుకునేందుకు సర్కారు అనుమతించింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఆదివారం 237 కరోనా కేసులు వెలుగుచూడగా, ఏడుగురు మరణించారు. కరోనా మరణాలు ఎక్కువగా కాంగ్రా జిల్లాలో వెలుగుచూశాయి.మొత్తంమీద కరోనా ఆంక్షల సడలింపుతో పర్యాటక ప్రాంతమైన సిమ్లాలో పర్యాటకుల సందడి వాతావరణం ఏర్పడింది. 


Updated Date - 2021-06-14T11:32:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising