ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎట్టకేలకు దిగివచ్చిన Tomoto

ABN, First Publish Date - 2021-11-26T12:55:01+05:30

గత వారం రోజులకు పైగా ఆకాశాన్నంటిన టమోటా ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కోయంబేడు మార్కెట్‌లో గురువారం ఉదయం నుంచి కేజీ టమోటా రూ.70 నుంచి రూ.80కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కోయంబేడుకు 45 లారీల దిగుమతి

- రేషన్‌షాపుల్లో అమ్మకాలు


చెన్నై: గత వారం రోజులకు పైగా ఆకాశాన్నంటిన టమోటా ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కోయంబేడు మార్కెట్‌లో గురువారం ఉదయం నుంచి కేజీ టమోటా రూ.70 నుంచి రూ.80కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నగరాలలో కేజీ టామోటాను రూ.40 నుంచి రూ.50కు అమ్ముతున్నారు. ఒకే రోజు టమోటా కేజీ ధర రూ.140 నుంచి రూ.70కు తగ్గటంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం టమోటాల ధరలను తగ్గించేందుకు ఫామ్‌ గ్రీన్‌షాపులలో సహకార శాఖ ద్వారా వాటిని విక్రయించడం, గురువారం నుంచి రేషన్‌ షాపులలోనూ వాటి అమ్మకాలు ప్రారంభించడం, మరో వైపున పొరుగు రాష్ట్రాల నుంచి 45 లారీల లోడు టమోటాలు కోయంబేడు మార్కెట్‌ చేరడంతో వ్యాపారులు ధర తగ్గించక తప్పలేదు. అంతేకాకుండా కోయంబేడు మార్కెట్‌ వద్ద కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వం మూసివేసిన ‘టమోటా గ్రౌండ్‌’ పేరుతో పిలువబడే మైదానాన్ని తెరిస్తే కేజీ టమోటాలను రూ.40కు విక్రయించేందుకు సిద్ధంగా వున్నామని వ్యాపారుల సంఘం నాయకులు గురువారం హైకోర్టుకు తెలిపారు. టమోటా గ్రౌండ్‌లో పొరుగు రాష్ట్రాల నుంచి టమోటాల లోడుతో వచ్చే లారీలను నిలిపేందుకు అవకాశం వుండేదని, ప్రస్తుతం ఆ మైదానాన్ని అధికారులు మూసివేయడంతో తక్కువ సంఖ్యలో టామోటాలు దిగుమతి అవుతున్నాయని వ్యాపారులు తెలిపారు. వ్యాపారుల సంఘం తరఫున దాఖలైన ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరుపుతానని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇలా ఒకేరోజు అన్ని వైపులా టామోటాల ధరను తగ్గించే ప్రయత్నాలు జరగడంతో కోయంబేడులోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో తగ్గుముఖం పట్టాయి. ఇదిలా వుండగా ఫామ్‌ గ్రీన్‌షాపులలో మరి కొద్ది రోజులపాటు కూరగాయలతో పాటు టమోటాలను కూడా అధికంగా విక్రయించనున్నట్టు సహకార శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టమోటాల ధరలు సాధారణ స్థాయికి చేరేంతవరకూ ఈ అమ్మకాలు కొనసాగుతాయని వివరించారు.

Updated Date - 2021-11-26T12:55:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising