ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Haiti: భూకంపంలో 1297కు పెరిగిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2021-08-16T13:13:53+05:30

కరీబియన్‌ దీవి హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 1297కు పెరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లెస్‌ కెయిస్: కరీబియన్‌ దీవి హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 1297కు పెరిగింది.భూకంపం వల్ల ఒక్క దక్షిణ దీవిలోనే 500 మంది మరణించారు.మరో 2,800 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2868 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో 5,410 ఇళ్లు దెబ్బతిన్నాయని హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధిపతి జెర్రీ చండలర్ చెప్పారు. దేశవ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిధిలాల కింద వందలాదిమంది చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. 


గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. క్షతగాత్రులకు సత్వరం వైద్యం అందిస్తున్నామని కరీబియన్ దీవి ప్రధానమంత్రి ఏరియల్ హెన్రీ చెప్పారు. సెయింట్ లూయీస్ డు సూద్ కు 12 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం 10 కిలోమీటర్ల లోతు వరకు ఉందని అధికారులు గుర్తించారు.


Updated Date - 2021-08-16T13:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising