ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి సబర్బన్‌ రైళ్లలో అందరికీ అనుమతి

ABN, First Publish Date - 2021-06-25T14:56:06+05:30

చెన్నై నగరంలో తిరిగే సబర్బన్‌ రైళ్ళలో అందరూ ప్రయాణించేందుకు దక్షిణ రైల్వే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రైళ్ళలో శుక్రవారం నుంచి ప్రతి ఒక్కరూ ప్రయాణించవచ్చు. దక్షిణ రైల్వే చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                          - ప్రకటించిన దక్షిణ రైల్వే 


అడయార్‌(చెన్నై): చెన్నై నగరంలో తిరిగే సబర్బన్‌ రైళ్ళలో అందరూ ప్రయాణించేందుకు దక్షిణ రైల్వే అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రైళ్ళలో శుక్రవారం నుంచి ప్రతి ఒక్కరూ ప్రయాణించవచ్చు. దక్షిణ రైల్వే చేసిన ఈ ప్రకటనపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈనెల 21వ తేదీ నుంచి చెన్నైతో పాటు కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్ళూరు జిల్లాల్లో బస్సుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అలాగే మెట్రోరైల్‌ సర్వీసులను నడుపుతున్నారు. సిటీ బస్సులతో పాటు మెట్రో సర్వీసులు ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి. సబర్బన్‌ రైళ్ళలో గురువారం వరకు కేవలం కొవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు అత్యవసర సేవలు, ప్రభుత్వ, పైవేటు సిబ్బంది మాత్రమే ప్రయాణించే వారు. కానీ, శుక్రవారం నుంచి ప్రతి ఒక్కరూ ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే పేర్కొంది. చెన్నై నగర వాసులు సిటీ బస్సుల్లో ప్రయాణించడం కంటే సబర్బన్‌ రైళ్ళలో ప్రయాణించేందుకే ప్రాధాన్యత ఇస్తారు. దీనికి కారణంగా తక్కువ ప్రయాణ చార్జీతో పాటు సమయం బాగా అదా అవుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో నెలవారీ పాస్‌లపై అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తుంటారు. 

Updated Date - 2021-06-25T14:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising