ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ‘మేట్టూరు’ నీటి విడుదల

ABN, First Publish Date - 2021-08-01T14:47:44+05:30

సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం నీటిని ఆదివారం నుంచి వచ్చే డిసెంబరు 15వ తేదీ వరకు 137 రోజులు సాగు భూములకు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం నీటిని ఆదివారం నుంచి వచ్చే డిసెంబరు 15వ తేదీ వరకు 137 రోజులు సాగు భూములకు విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మేట్టూరు డ్యాం నుంచి పుల్లంబాడి, మేట్టు కాలువ ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న సాగు ప్రాంతాల రైతులు ఈ ఆర్ధిక సంవత్సరంలో వ్యవసాయ పనుల నిమిత్తం మేట్టూరు డ్యాం నీటిని విడుదల చేయాలని ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు. అదే విధంగా తిరుచ్చి, తంజావూరు, అరియలూరు జిల్లాలకు చెందిన రైతులు కూడా ఇదే కోరికను ప్రభుత్వం ముందుంచారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం, మొత్తం 42,736 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటి వసతి కల్పిస్తూ ఆదివారం నుంచి మేట్టూరు డ్యాం నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కాగా, శనివారం ఉదయం మేట్టూరు డ్యాంకు సెకనుకు 21,692 ఘనపుటడుగుల నీరు వస్తోంది. మరోవైపు డ్యాంకు నీరు చేరుతుండడంతో నీటిమట్టం 81.97 అడుగుల నుంచి 82.65 అడుగులకు పెరిగింది. కావేరి డెల్టా సాగుకు సెకనుకు 14 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-01T14:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising