ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే అమెజాన్‌ అధిపతి అంతరిక్ష యాత్ర

ABN, First Publish Date - 2021-07-20T07:15:47+05:30

అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి కీలకమైన మలి అడుగు మంగళవారం పడనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, జూలై 19: అంతరిక్ష పర్యాటకానికి సంబంధించి కీలకమైన మలి అడుగు మంగళవారం పడనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 12న చేపట్టిన అంతరిక్ష యాత్ర తొలి అడుగు కాగా, అదే బాటలో అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ నడవనున్నారు. సొంత సంస్థ  ‘బ్లూ ఆరిజిన్‌’ అభివృద్ధి చేసిన పునర్వినియోగ రాకెట్‌ ‘న్యూ షెపర్డ్‌’లో.. మరో ముగ్గురితోకలిసి ఆయన రోదసిలోకి వెళ్లనున్నారు. వారిలో ఒకరు బెజోస్‌ సోదరుడు మార్క్‌. మరొకరు 82 ఏళ్ల మాజీ మహిళా పైలట్‌ వాలీ ఫంక్‌. మూడో వ్యక్తి.. అలివర్‌ డేమెన్‌ అనే 18 ఏళ్ల విద్యార్థి. రోదసిలోకి వెళ్లనున్న అతి పిన్న, పెద్ద వయస్కులు వీరు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ఈ యాత్ర మొదలుకానుంది. బ్రాన్సన్‌, శిరీష బండ్ల బృందం వెళ్లిన స్పేస్‌ఫ్లైట్‌ను నడపడానికి పైలట్లు కావాలి. కానీ, బెజోస్‌ యాత్ర పూర్తిగా ఆటోమేటిక్‌. దీన్ని నడపడానికి పైలట్లు అవసరం లేదు. పైలట్లు లేకుండా పూర్తిగా సామాన్య పౌరులతో చేపట్టే తొలి రోదసియాత్రగా దీన్ని అభివర్ణించవచ్చు. పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఒక సుదూర ప్రదేశం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది. బెజోస్‌ బృందం 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్‌ రేఖ దాటి భూమి అందాలను వీక్షించి తిరిగి రానున్నారు.  


‘న్యూ షెపర్డ్‌’ ఇంజనీర్లలో భారతీయ మహిళ

న్యూషెపర్డ్‌ రాకెట్‌ను అభివృద్ధి చేసిన ఇంజనీర్ల బృందంలో.. మహారాష్ట్రకు చెందిన సంజల్‌ గవాండే (30) కూడా ఉన్నారు. బ్లూఆరిజిన్‌ కంపెనీలో సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆమె పుట్టిపెరిగిందంతా మహారాష్ట్రలోని కల్యాణ్‌ నగరంలో. ఆమె తండ్రి అశోక్‌. కల్యాణ్‌-డోంబివిలి మునిసిపల్‌ విభాగం విశ్రాంత ఉద్యోగి. తల్లి సురేఖ రిటైర్డ్‌ ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగి. ముంబై వర్సిటీ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ పూర్తిచేసిన ఆమె..మిషిగన్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. అనంతరం విస్కాన్సిన్‌లో మెర్క్యురీ మెరైన్‌ అనే సంస్థలో పనిచేశారు. తర్వాత టొయోటా రేసింగ్‌ డెవల్‌పమెంట్‌లో పనిచేశారు. 2016లో పైలట్‌ లైసెన్స్‌ పొందిన తర్వాత.. నాసాలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. కానీ, పౌరసత్వ సమస్యల వల్ల ఆమెకు నాసాలో ఉద్యోగం రాలేదు. దీంతో ఆమె బ్లూఆరిజిన్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసి సిస్టమ్స్‌ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. ఎప్పటికైనా ఒక వ్యోమనౌకను తయారుచేయాలన్నది ఆమె చిన్ననాటి కల.

Updated Date - 2021-07-20T07:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising