ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘NEET’ రాజకీయం: తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ ఫైర్

ABN, First Publish Date - 2021-09-15T21:45:16+05:30

ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే బిల్లును వ్యతిరేకించింది. అనంతరం బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు బీజేపీ అధినేత కె.అన్నామలై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నీట్‌ను అడ్డుపెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని తమిళనాడు భారతీయ జనతా పార్టీ విమర్శించింది. రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకించిన రూపొందించిన బిల్లును అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీలు సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే బిల్లును వ్యతిరేకించింది. అనంతరం బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు బీజేపీ అధినేత కె.అన్నామలై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


‘‘కొద్ది రోజుల క్రితం ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం కనిమొజి అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థులను నేను వేడుకుంటున్నాను. దయచేసి ఇలా చేయకండి. నీట్ చుట్టూ జరుగుతున్నరాజకీయాలను మేము సరిదిద్దుతాం. డీఎంకే దీన్ని రాజకీయం చేసింది. విద్యార్థుల జీవితాలు ఏమైపోయినా వారికి పరవాలేదు. తమిళనాడు ప్రజలు దీన్ని మర్చిపోరు, బీజేపీ కూడా మర్చిపోదు. తమిళనాడులో పరీక్ష జరగదని చెప్పి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులను నిలిపివేశారు. చివరి నిమిషంలో నీట్ జరుగుతుందని అంగీకరించారు. దీని వల్ల విద్యార్థులు ఎంత గాయపడ్డారో ఊహించుకోండి’’ అని అన్నామలై అన్నారు.

Updated Date - 2021-09-15T21:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising