ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీప్ ఫ్రీజర్‌లో కాంగ్రెస్ : టీఎంసీ పత్రిక

ABN, First Publish Date - 2021-12-03T22:30:08+05:30

కాంగ్రెస్, టీఎంసీల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : కాంగ్రెస్, టీఎంసీల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. కాంగ్రెస్ ప్రస్తుతం డీప్ ఫ్రీజర్‌లో ఉందని టీఎంసీ పత్రిక ‘జాగో బంగ్లా’లో ఓ వ్యాసం పేర్కొంది. బీజేపీకి ప్రత్యామ్నాయం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీయేనని పేర్కొంది. బీజేపీతో పోరాటానికి టీఎంసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. 


ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, కాంగ్రెస్‌కు నాయకత్వం వహించడం ఓ వ్యక్తికిగల దైవదత్త హక్కు కాదని పేర్కొన్నారు. గడచిన పదేళ్ళలో జరిగిన ఎన్నికల్లో 90 శాతం ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తరుణంలో ఆ పార్టీకి నాయకత్వం వహించడం ఓ వ్యక్తికిగల దైవదత్త హక్కు కాదన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేసినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. 


టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ బుధవారం ముంబైలో పర్యటించి, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం యూపీఏ అనేదే లేదన్నారు. 


మేఘాలయలో 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండేవారు. వీరిలో 12 మందిని టీఎంసీ గత వారం చేర్చుకుంది. మరోవైపు త్రిపుర పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఎంసీ పాల్గొని, బీజేపీపై పోరాడింది. రానున్న గోవా శాసన సభ ఎన్నికల్లో పాల్గొని, టీఎంసీ బలాన్ని పెంచుకోవడం ద్వారా బీజేపీని గట్టిగా వ్యతిరేకించే నేతగా మమత బెనర్జీని చూపించాలని టీఎంసీ ప్రయత్నిస్తోంది. 


ఈ నేపథ్యంలో ‘జాగో బంగ్లా’లో రాసిన వ్యాసంలో ప్రశాంత్ కిశోర్ ట్వీట్‌ను ప్రస్తావించారు. ఆయన మాత్రమే కాకుండా, కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. 


‘డీప్ ఫ్రీజర్‌లో కాంగ్రెస్’ శీర్షికతో రాసిన ఈ వ్యాసంలో, ‘‘కాంగ్రెస్ ఓ పాత సత్తు గిన్నె, సత్తా ఉడిగిపోయిన పార్టీ అని టీఎంసీ చాలా కాలం నుంచి చెప్తోంది. బీజేపీతో పోరాడే సత్తా కాంగ్రెస్‌కు లేదు. ఆ పార్టీ అంతఃకలహాలలో ఎంతగా కూరుకుపోయిందంటే, ప్రతిపక్షాన్ని నిర్మించే సమయం కానీ, సత్తా కానీ లేనంతగా కూరుకుపోయింది. యూపీఏ లేదు’’ అని పేర్కొన్నారు. 


దేశానికి ప్రస్తుతం ప్రత్యామ్నాయ కూటమి అవసరమని, ప్రతిపక్ష పార్టీలు ఆ బాధ్యతను మమత బెనర్జీకి అప్పగించాయని ఈ వ్యాసం పేర్కొంది. ఖాళీని భర్తీ చేయడం కోసం ప్రతిపక్షాలు మమత వైపు చూస్తున్నాయని తెలిపింది. ఆమె ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణగల ప్రతిపక్ష నేత అని వివరించింది. 


Updated Date - 2021-12-03T22:30:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising