ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎంసీ అంటే టెంపుల్, మసీదు, చర్చి: మమత

ABN, First Publish Date - 2021-12-14T00:06:17+05:30

మనం బీజేపీతో పోరాడాలి. మనం గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు, మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు వెనకడుగు వేయొద్దు. ముందుకే సాగిపోండి. మేము ఇక్కడికి వచ్చింది ఓట్లను చీల్చడానికి కాదు. ఓట్లను ఏకం చేసి టీఎంసీ కూటమిని గెలిపించడానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనాజీ: టీఎంసీ అనేదానికి ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. టీ అంటే టెంపుల్ (గుడి), ఎం అంటే మసీద్, సీ అంటే చర్చ్ అని ఆమె చెప్పుకొచ్చారు. గోవా పర్యటనలో ఉన్న ఆమె అక్కడి కార్యకర్తలతో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గోవాలో బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకే నిర్ణయించుకున్నామని, ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి ఒక్క అడుగు వేసేది లేదని పార్టీ కార్యకర్తలతో మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.


‘‘మనం బీజేపీతో పోరాడాలి. మనం గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు, మీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు వెనకడుగు వేయొద్దు. ముందుకే సాగిపోండి. మేము ఇక్కడికి వచ్చింది ఓట్లను చీల్చడానికి కాదు. ఓట్లను ఏకం చేసి టీఎంసీ కూటమిని గెలిపించడానికి. ఇది బీజేపీకి ప్రత్యామ్నాయం. ఇదే ప్రత్యామ్నాయం. దీనికి ఎవరైనా మద్దతు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మేం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2021-12-14T00:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising