తిరుమల బాలాజీ దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక విమాన ప్యాకేజీ
ABN, First Publish Date - 2021-02-13T17:48:43+05:30
తిరుమల బాలాజీ దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో కలిసి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది....
న్యూఢిల్లీ : తిరుమల బాలాజీ దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో కలిసి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది. కరోనా తర్వాత తిరుమల దర్శనం కోసం విమానయాన ప్యాకేజీని ఐఆర్సీటీసీ పునర్ ప్రారంభించింది. తిరుమల బాలాజీ ఆలయం, పద్మావతి దేవాలయం, శ్రీకాళహస్తి దేవస్థానం సందర్శనతో కూడిన ప్రత్యేక విమాన ప్యాకేజీని ఆరంభించారు. ఢిల్లీ నుంచి చెన్నైకు రెండువైపుల విమాన చార్జీలు, తిరుపతిలో హోటల్ వసతి, బాలాజీ, పద్మావతి, శ్రీకాళహస్తి ఆలయాల సందర్శన స్థలాలు, ఆలయాల ప్రవేశ టికెట్లు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. 16,535రూపాయల నుంచి ఈ ప్యాకేజీని ప్రారంభించారు.ఢిల్లీ విమానాశ్రయంలో యాత్రికుల విమానం 6.50 గంటలకు బయలు దేరి 9.20గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటుంది.యాత్రికులను హోటల్ కు తీసుకువెళ్లి అక్కడి నుంచి శ్రీకాళహస్తి, చంద్రగిరికోట, పద్మావతి ఆలయాల దర్శనాలు చేయిస్తారు.అనంతరం తిరుపతిలో రాత్రి భోజనం తర్వాత బస ఏర్పాటు చేస్తారు.మరునాడు ఉదయాన్నే అల్పాహారం తర్వాత బాలాజీ దర్శనం ఉంటుంది. అనంతరం యాత్రికులను అక్కడి నుంచి విమానాశ్రయానికి తరలించి ఢిల్లీకి చేరుస్తారు.
Updated Date - 2021-02-13T17:48:43+05:30 IST