ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుంది.. స్కూల్స్ తెరవాలన్న ఎయిమ్స్ డైరెక్టర్

ABN, First Publish Date - 2021-07-20T13:29:13+05:30

రోనా రెండో వేవ్ మిగిల్చిన పీడకలలు మర్చిపోకముందే కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందనే నిపుణుల హెచ్చరికలు దేశ ప్రజలను కలవర పరుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ మిగిల్చిన పీడకలలు మర్చిపోకముందే కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందనే నిపుణుల హెచ్చరికలు దేశ ప్రజలను కలవర పరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో స్కూల్స్‌ తెరవాలని ఆయన సూచించారు. అయితే వీటిని పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా తెరవాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదన్న ఆయన.. దేశంలో పిల్లలు ఇప్పటికే చాలా వరకూ కరోనా వైరస్‌కు ఎక్స్‌పోజ్ అయ్యారని, దీనివల్ల వారిలో ఇమ్యూనిటీ శక్తి పెరిగిందని చెప్పారు. విద్యార్థుల మానసిక వికాసానికి చదువు చాలా అవసరమన్న ఆయన.. అందుకే స్కూళ్లు తెరవడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.


కరోనా మూడో వేవ్ పిల్లలను టార్గెట్ చేస్తుందని వచ్చిన వదంతులు వట్టి అపోహలేనని ఇటీవల ఎయిమ్స్ చేసిన సర్వేలో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గులేరియా మాట్లాడుతూ.. సెప్టెంబరు నాటికల్లా పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పిల్లలపై జరుగుతున్న కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, అన్నీ సక్రమంగా జరిగితే సెప్టెంబరు నాటికి రెండేళ్ల పిల్లలు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు.

Updated Date - 2021-07-20T13:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising