ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కూలీలపై ఉగ్రవాద దాడుల నిరోధానికి పటిష్ట భద్రత : కేంద్రం

ABN, First Publish Date - 2021-12-15T01:01:07+05:30

కశ్మీరు లోయలో వలస కార్మికులను ఉగ్రవాద దాడుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కశ్మీరు లోయలో వలస కార్మికులను ఉగ్రవాద దాడుల నుంచి కాపాడేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. కోస్మే ఫ్రాన్సిస్కో కైటనో సర్డిన్హా అడిగిన ప్రశ్నకు రాయ్ స్పందించారు. 


కశ్మీరు లోయలో వలస కూలీలపై హింసాత్మక దాడులను నిరోధించాలని ప్రభుత్వం భావిస్తోందా? అని లోక్‌సభ ఎంపీ కోస్మే అడిగారు. దీనిపై నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా స్పందిస్తూ, వలస కూలీలపై ఉగ్రవాద దాడులను నిరోధించేందుకు పటిష్టమైన భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కశ్మీరు లోయలో వలస కూలీలు నివసించే ప్రాంతాల్లోనూ, వారు పని చేసే ప్రాంతాల్లోనూ నిరంతరం గస్తీ, ముందస్తు నియంత్రణ కార్యకలాపాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని వేళలా తనిఖీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 


వలస కూలీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో కశ్మీరు లోయకు వెళ్తూ ఉంటారు. చలికాలం ప్రారంభంలో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్తారు. ఈ విధంగా స్వస్థలాలకు వెళ్ళేవారికి కూడా రక్షణ కల్పిస్తున్నట్లు నిత్యానంద చెప్పారు. 


Updated Date - 2021-12-15T01:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising