ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మూడు ఆక్సిజన్‌ రైళ్ల రాక

ABN, First Publish Date - 2021-06-09T13:04:23+05:30

ఒడిసా రాష్ట్రం నుంచి మరో మూడు ఆక్సిజన్‌ రైళ్లు రాష్ట్రానికి చేరాయి. ఈ మూడు రైళ్లలో ట్యాంకర్ల ద్వారా తరలించిన 204.14 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకొని రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్యారీస్‌(చెన్నై): ఒడిసా రాష్ట్రం నుంచి మరో మూడు ఆక్సిజన్‌ రైళ్లు రాష్ట్రానికి చేరాయి. ఈ మూడు రైళ్లలో ట్యాంకర్ల ద్వారా తరలించిన 204.14 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకొని రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులకు తరలించినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రులు, జిల్లా ప్రధాన ఆస్పత్రులు, ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులతో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పాజిటివ్‌తో చేరిన వారు సకాలంలో ఆక్సిజన్‌ అందక మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, దక్షిణ రైల్వే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా చేసేలా ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ రీతిలో ఇప్పటివరకు రాష్ట్రానికి మొత్తం 53 రైళ్ల ద్వారా 3,608.99 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి అయింది. 51వ ఆక్సిజన్‌ నుంచి ఒడిసా రాష్ట్రం రూర్కెలా నుంచి నాలుగు కంటైనర్లలో 85.96 మెట్రిక్‌ టన్నులు తిరుచ్చి రైల్వేస్టేషన్‌, 52 రైలు 85.5 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌తో కూడిన రైలు రూర్కెలా నుంచి తండయార్‌ పేటకు, 53వ రైలు కోవై మదుకరెకుౖ 32.33 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌తో చేరుకుంది.


Updated Date - 2021-06-09T13:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising