ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగు చట్టాలపై పార్లమెంట్ లోపలా బయటా రగడ

ABN, First Publish Date - 2021-07-22T18:01:37+05:30

న్యూఢిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలంటూ రైతులతో పాటు కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. రాహుల్ వెంట లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. రైతుల అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉభయసభల్లోనూ డిమాండ్ చేశారు. 





ఇటు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తామని బీకేయూ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు వద్ద రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. 


మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. చట్టాలపై అవగాహన కల్పించేందుకు రైతులతో చర్చలు జరుపుతునే ఉన్నామన్నారు. రైతుల ఆందోళనలపై మరోసారి చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. రైతులు ఆందోళన విరమించాలని తోమర్ కోరారు.    





Updated Date - 2021-07-22T18:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising