ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి నుంచి నా ప్రాణానికి ముప్పు!

ABN, First Publish Date - 2021-04-08T07:38:22+05:30

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌ రాముడో.. రావణుడో తేలేదాకా రాష్ట్రంలో అడుగే పెట్టను: రఘురామకృష్ణంరాజు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పుందని వైసీపీ ఎంపీ  రఘురామకృష్ణంరాజు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. అం దుచేత తక్షణమే తనకు భద్ర త పెంచాలని హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోనూ ప్రత్యేక రక్షణ కల్పించాలని బుధవారం ఆయనకు లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ తాను 6వ తేదీన సీబీఐ కోర్టులో కేసు దాఖలు చేశాన ని.. దీంతో తనను హతమారుస్తామని బెదిరిస్తూ అనేక ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ బెదిరింపు కాల్స్‌పై తాను ఆందోళన చెందనప్పటికీ.. సీఎం జగన్‌రెడ్డి నేర చరిత్రను బట్టి ఆందోళన కలుగుతోందని తెలియజేశారు. తనను హతమార్చేందుకు కడప జిల్లా నుంచి కొందరు ప్రొఫెషనల్‌ కిల్లర్లను పురమాయించిన ట్లు తెలిసిందని పేర్కొన్నారు. కాగా.. అక్రమాస్తుల కేసులో జగన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలన్న తన వ్యాజ్యాన్ని కోర్టుకొట్టివేయలేదని రఘురామరాజు స్పష్టం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌ పాలకుడు (జగన్‌) రాముడో.. రావణుడో తేలాల్సి ఉంది. ఇది తేలేవరకు రాష్ట్రంలో కాలు పెట్టను’ అని ఆయన శపథం చేశారు.


‘సీఎం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. నన్ను తప్పుడు కేసుల్లో ఇరికించడంవల్ల లాభంలేదు.. ఇక నా పని పట్టాలని పనిగట్టుకున్నారు. ట్రై చెయ్‌.. ఓ పెన్‌ చాలెంజ్‌ మైడియర్‌.. నా వెనుక దేవుడు ఉన్నాడు. ప్రజలు ఉన్నారు.. నా ఒంటిపై ఈగ వాలితే నడివీధిలో నిన్ను(జగన్‌) తొక్కుకుంటూపోతారు. బెయిల్‌ రద్దయితే జైలుకు పోయే పాలకుడు అక్రమ డబ్బుతో సీబీఐని ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై కేంద్ర హోం శాఖకు, సీబీఐ డైరెక్టర్‌కూ ఫిర్యాదు చేశాను. ప్రధానితోనూ త్వరలో భేటీ అవుతా’ అని తెలిపారు.  

Updated Date - 2021-04-08T07:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising