ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోం స్టోర్ యూనిట్‌లో 1000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ దెబ్బతింది...

ABN, First Publish Date - 2021-01-20T17:17:02+05:30

స్టోర్ లో నిల్వ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ గడ్డకట్టిన ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ మెడికల్ కళాశాల ఆసుపత్రి లో వెలుగు చూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిల్చార్ (అసోం) : స్టోర్ లో నిల్వ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ గడ్డకట్టిన ఘటన అసోం రాష్ట్రంలోని సిల్చార్ మెడికల్ కళాశాల ఆసుపత్రి లో వెలుగు చూసింది.కాచర్ జిల్లా సిల్చార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని స్టోర్ యూనిట్‌లో 1000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ స్తంభించి పోయింది.నిబంధనల ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను -8 డిగ్రీల సెల్షియస్ వద్ద నిల్వ చేయాలి. కాని 1000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సిల్చార్ మెడికల్ కళాశాల ఆసుపత్రి స్టోరులో ఐఎల్ఆర్ ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉంది. దీంతో టీకాలు పాక్షికంగా స్తంభించి పోయాయని కాచర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి చెప్పారు. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ లో సాంకేతిక లోపం వల్ల ఉష్ణోగ్రత నియంత్రించలేక తగ్గిందని అధికారులు చెప్పారు. దీంతో 1000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను దీనికి బదులుగా మరో బ్యాచ్ ను పంపించాలని అసోం వైద్యఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ సంఘటనపై నివేదికను పంపించాలని అసోం ఆరోగ్యం శాఖ ఆసుపత్రి అథారిటీని కోరింది. 

Updated Date - 2021-01-20T17:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising