ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడి ప్రజలకు దిమ్మతిరిగే షాక్!.. టీకా తీసుకోని వారిని ఇకపై..

ABN, First Publish Date - 2021-07-29T22:35:31+05:30

టీకా వద్దంటున్న వారికి ఊహించని షాకిచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టేందుకు ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నాయి. కొన్ని దేశాలు తాయిలాల ఆశ చూపి టీకా తీసుకోవాలంటూ ప్రజలను ప్రోత్సహిస్తుంటే మరి కొన్ని దేశాలు బెత్తం చూపించి వారిని దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫిలిప్పీన్స్ తాజాగా రెండో కోవలోకి వచ్చి చేరింది. డెల్టా వేరియంట్‌‌ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో అక్కడి ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో టీకాను తీసుకోని వారిని ఇంటి గడపదాటనిచ్చేది లేదంటూ అధ్యక్షుడు రొడ్రీగో డుటెర్టే ప్రజలను హెచ్చరించారు. డెల్టా నుంచి సమాజాన్ని కాపాడేందుకు ఇది తప్పదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం టీవీ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన..టీకాను వద్దంటూ మొండికేస్తున్న వారికి ఇలా ఊహించని షాకిచ్చారు. ప్రజలను ఇంటి గడపదాటకుండా అడ్డుకునేందుకు దేశంలోని చట్టం ఏదీ లేదని చెబుతూనే..ఈ విషయంలో ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు వెరవనని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-29T22:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising