ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘‘పిలిచి మరీ అవమానిస్తారా?’’ మమత తీవ్ర ఆగ్రహం

ABN, First Publish Date - 2021-01-23T22:57:26+05:30

నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని బెంగాల్‌లోని విక్టరియో మెమోరియల్ హాల్‌లో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : నేతాజీ సుభాస్ చంద్రబోస్ 125 వ జయంత్యుత్సవాలను పురస్కరించుకొని బెంగాల్‌లోని విక్టరియో మెమోరియల్ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ కూడా హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడాల్సిందిగా నిర్వాహకులు ఆహ్వానించారు. సీఎం మమత మాట్లాడడానికి సన్నద్ధమవ్వడమే ఆలస్యం... సభలోని కొందరు ‘జై శ్రీరాం... జైశ్రీరాం’’ అంటూ ఒక్కసారిగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో దీదీ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రభుత్వం  పక్షాన నిర్వహిస్తున్న కార్యక్రమం. హుందాతనం అత్యావశ్యకం. హుందాతనంతో వ్యవహరించాలి. ఇదేమీ రాజకీయ పార్టీ సభ కాదు. కార్యక్రమానికి ఒకరిని ఆహ్వానించిన తర్వాత ఇలా అవమానించడం మీకు భావ్యం కాదు. దీనికి నిరసనగా నేనేమీ మాట్లాడను. ముగిస్తున్నాను. జై హింద్... జై బంగ్లా..’’ అంటూ మమతా బెనర్జీ ఆమె స్థానానికి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-01-23T22:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising