కరోనా సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా థర్డ్ వేవ్ ఉండదు: అధ్యయనంలో వెల్లడి
ABN, First Publish Date - 2021-06-26T11:08:51+05:30
కోవిడ్-19 థర్డ్ వేవ్ తలెత్తితే అది సెకెండ్ వేవ్ అంత....
న్యూఢిల్లీ: కోవిడ్-19 థర్డ్ వేవ్ తలెత్తితే అది సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండబోదని ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్)లో ప్రచురితమైన గణిత 'మోడలింగ్' విశ్లేషణ ఆధారంగా, వ్యాక్సినేషన్ పరిధిని విస్తరించడం వల్ల కరోనా వైరస్ థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. సెకెండ్ వేవ్ కొనసాగుతున్న మూడు నెలల కాల వ్యవధిలోనే జనాభాలో 40 శాతం మంది రెండు మోతాదుల టీకాను తీసుకున్న విషయాన్ని అధ్యయనం గుర్తు చేస్తోంది.
ముమ్మర వ్యాక్సినేషన్ కారణంగా కరోనా వ్యాప్తి తీవ్రతను 60 శాతం వరకూ తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంటోంది. భారతదేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ సంభావ్యత: గణిత మోడలింగ్ ఆధారిత విశ్లేషణ అధ్యయనకర్తలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు చెందిన సందీప్ మండల్, బల్‌రామ్ భార్గవ, సమేరిన్ పాండా, ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కు చెందిన నిమ్లాన్ అరినామిన్పతి ఉన్నారు. థర్డ్ వేవ్‌కు సంబంధించిన నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజలలో కరనాను ఎదుర్కొనే రోగనిరోధక సామర్థ్యం కాలక్రమేణా తగ్గవచ్చు. పలితంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా లేకపోలేదని వారు చెబుతున్నారు. కాగా కోవిడ్-19 థర్డ్ వేవ్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయడానికి డైరెక్టరేట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ హోమియోపతి ఆఫ్ ఇండియా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీలో అంటు వ్యాధులు, ముఖ్యంగా పిల్లలకు చికిత్స అందించడంలో అనుభవం కలిగిన వైద్యులు ఉన్నారు.
Updated Date - 2021-06-26T11:08:51+05:30 IST