ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిటన్‌లో థర్డ్‌ వేవ్‌!

ABN, First Publish Date - 2021-06-18T09:09:42+05:30

డెల్టా వేరియంట్‌ ప్రభావం నేపథ్యంలో గురువారం బ్రిటన్‌లో 11 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఇవే అత్యధికం. అంతేకాక, గత వారంతో పోలిస్తే ఇవి దాదాపు 50 శాతం అధికం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11 వేల కేసులు.. ఫిబ్రవరి తర్వాత అత్యధికం

గత వారంతో పోలిస్తే 50 శాతం ఎక్కువ


లండన్‌, జూన్‌ 17: డెల్టా వేరియంట్‌ ప్రభావం నేపథ్యంలో గురువారం బ్రిటన్‌లో 11 వేల కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఇవే అత్యధికం. అంతేకాక, గత వారంతో పోలిస్తే ఇవి దాదాపు 50 శాతం అధికం. కొత్త కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌వే. ఆస్పత్రుల్లో చేరికలు సైతం 45 శాతం పెరిగాయి. గత గురువారం కరోనాతో ఏడు మరణాలు సంభవించగా.. ఈ గురువారం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని నిపుణులు బ్రిటన్‌లో కరోనా థర్డ్‌ వేవ్‌ మొదలైందని చెబుతున్నారు.


అయితే, గతేడాది మాదిరి కఠిన లాక్‌డౌన్‌తో పరిస్థితిని అదుపులోకి తేవొచ్చని సూచిస్తున్నారు. కాగా, డెల్టా వేరియంట్‌ కారణంగా.. దేశంలో మే నెల ప్రారంభంతో చూస్తే కేసులు 50 శాతం పెరిగాయని ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం పేర్కొంది. అయితే, థర్డ్‌ వేవ్‌లో మరణాలు భారీగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. సెకండ్‌ వేవ్‌  తీవ్రంగాఉన్నప్పుడు రోజుకు 1,200 మరణాలు సంభవించగా.. ఈసారి ఆ సంఖ్య వంద దాటకపోవచ్చని తెలిపింది.

Updated Date - 2021-06-18T09:09:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising