ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 ఏళ్లు కాబుల్‌లో ఉండి భారత్ వచ్చిన డాక్టర్ ఏమన్నారంటే....

ABN, First Publish Date - 2021-08-18T13:41:20+05:30

అఫ్ఘానిస్థాన్‌‌లో ఇటీవలికాలంలో పరిస్థితులు ఎంత ఘోరంగా మారిపోయాయంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌‌లో ఇటీవలికాలంలో పరిస్థితులు ఎంత ఘోరంగా మారిపోయాయంటే... ఏళ్ల తరబడి అక్కడ ఉంటున్న వారు సైతం ఆ దేశాన్ని విడిచిపెట్టాలనే స్థిరాభిప్రాయానికి వచ్చేశారు. అఫ్ఘానిస్థాన్‌‌లో తమకు ఏమాత్రం రక్షణ లేదని వారు అంటున్నారు. కాబుల్‌లో సుమారు 16 ఏళ్ల పాటు వైద్య సేవలు అందించి ఇటీవలే ఇండియా వచ్చిన భారతీయ వైద్యుడు తన అనుభవాలను మీడియా ముందు వెళ్లగక్కారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో భారత్ వచ్చిన వారిలో ఈ వైద్యుడు ఒకరు. 


తన పేరును బయటపెట్టడానికి ఇష్టపడని ఆయన మాట్లాడుతూ అఫ్ఘానిస్థాన్‌‌లో పరిస్థితులు చూసి, తామంతా బెంబేలెత్తిపోయామని, గతంలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. తన కుమారుడు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డాడని, వాడికి చికిత్స అందిస్తూనే ఇక్కడకు చేరుకున్నామన్నారు. రాత్రివేళ తాలిబన్లు కాబుల్‌లోకి చొచ్చుకుని వచ్చారని, ఇంటి బయట భారీ శబ్ధాలు వినిపించాయని, ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు చూసి వణికిపోయామన్నారు. అక్కడ రోజురోజుకు పరిస్థితులు మరింత భీతావహంగా మారిపోతున్నాయని, అందుకే తాము ప్రాణాలు చేతబట్టుకుని భారత్ తరలివచ్చామని తెలిపారు.

Updated Date - 2021-08-18T13:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising