ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan హిందూ దేవాలయంలో దొంగలు పడ్డారు...

ABN, First Publish Date - 2021-11-01T12:49:41+05:30

పాకిస్థాన్‌ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయంలో మరో దారుణం జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌ దేశంలోని సింధ్ ప్రావిన్స్‌లోని హిందూ దేవాలయంలో మరో దారుణం జరిగింది.హిందూ దేవాలయంలో దొంగలు చొరబడి అమ్మవారి మూడు వెండి హారాలు, నగదును దోచుకెళ్లారు.సింధ్‌ పరిధిలోని కోత్రి ప్రాంతంలో ఉన్న దేవి మాత ఆలయంలో హుండీ నుంచి రూ.25వేల రూపాయల డబ్బుతోపాటు దేవతల మెడలో ఉన్న మూడు వెండి హారాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయ సంరక్షకుడు భగవాన్‌దాస్‌ ఫిర్యాదు మేర పాక్ పోలీసులు కేసు నమోదు చేశారు.నిందితులు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారని పాక్ పోలీసులు తెలిపారు. చోరీ సమయంలో దొంగలు ఆలయ దేవతలను అపవిత్రం చేశారన్న వాదనలను పోలీసులు తోసిపుచ్చారు.


ఆలయంలో చోరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని సింధ్‌లోని మైనారిటీల వ్యవహారాలశాఖ మంత్రి గియాంచంద్ ఎస్రానీ ఆదేశించారు.హిందూ సమాజం దీపావళికి సిద్ధమవుతున్న తరుణంలో దేవాలయాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేయాలని మంత్రి అధికారులను కోరారు.ఈ ఏడాది ఆగస్టులో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ హిందూ దేవాలయంపై గుంపు దాడి చేసి తగలబెట్టి, విగ్రహాలను ధ్వంసం చేసింది. భారత్ ఆలయంపై దాడిని ఖండించింది, మతపరమైన మైనారిటీలను రక్షించడంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైందని నిందించింది. 


Updated Date - 2021-11-01T12:49:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising