ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ఏర్పడి 24 గంటలు కూడా కాలేదు: బీజేపీపై మమత ఫైర్

ABN, First Publish Date - 2021-05-06T21:16:41+05:30

రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై గురువారం కోల్‌కతాలో ఆమె మాట్లాడుతూ ప్రజా తీర్పును భారతీయ జనతా పార్టీ నేతలు అంగీకరించడం లేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 24 గంటలు కూడా గడవలేదని, కానీ బీజేపీ నేతలు రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతూ రెచ్చగొట్టే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై గురువారం కోల్‌కతాలో ఆమె మాట్లాడుతూ ప్రజా తీర్పును భారతీయ జనతా పార్టీ నేతలు అంగీకరించడం లేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.


‘‘బీజేపీ నేతలు రాష్ట్రమంతా తిరుగుతూ అసాధారణ పరిస్థితులకు ప్రజలను రెచ్చగొడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి 24 గంటలు కూడా కాలేదు. కానీ బీజేపీ నేతలు లేఖలు పంపుతున్నారు. గ్రూపులను పంపుతున్నారు. పెద్ద ఎత్తు నేతలు వస్తున్నారు. నిజానికి వారు ప్రజా తీర్పును గౌరవించడం లేదు. నేను వారికి విజ్ణప్తి చేసేది ఒక్కటే. దయచేసి ప్రజా తీర్పును గౌరవించండి’’ అని మమతా బెనర్జీ అన్నారు.

Updated Date - 2021-05-06T21:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising