ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడొక టీకా.. ఇప్పుడొక టీకా

ABN, First Publish Date - 2021-06-24T09:07:40+05:30

ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి మిక్స్‌డ్‌ డోస్‌ టీకా తీసుకున్నారు. మొదటి డోసు ఆస్ట్రాజెనెకా టీకా, రెండో డోసు ఫైజర్‌ టీకా తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిక్స్‌డ్‌ డోసు టీకాలు వేయించుకున్న ఇటలీ ప్రధాని మారియో, జర్మనీ చాన్స్‌లర్‌ మెర్కెల్‌


రోమ్‌, బెర్లిన్‌, జూన్‌ 23: ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి మిక్స్‌డ్‌ డోస్‌ టీకా తీసుకున్నారు. మొదటి డోసు ఆస్ట్రాజెనెకా టీకా, రెండో డోసు ఫైజర్‌ టీకా తీసుకున్నారు. అలాగే.. జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ మొదటి డోసు ఆస్ట్రాజెనెకా, రెండో డోసు మోడెర్నా టీకా తీసుకున్నారు. ఇలా రెండు వేర్వేరు టీకాలను (మిక్స్‌డ్‌ డోసు) తీసుకుంటే కొత్త వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందనే ఉద్దేశంతోనే వారు ఇలా తీసుకున్నట్టు సమాచారం. మిక్స్‌డ్‌ డోసు టీకాల వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటూ మారియో ద్రాఘి గత వారమే ఒక ప్రకటన చేశారు.


 ఆస్ట్రాజెనెకా టీకా మొదటి డోసు తీసుకున్నాక తనలో తక్కువ సంఖ్యలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయని.. దాంతో వైద్యులు తనకు వేరే కంపెనీకి చెందిన టీకాను రెండో డోసుగా తీసుకోవాల్సిందిగా సూచించారని ఆయన వెల్లడించారు. మిక్స్‌డ్‌ డోస్‌ టీకాల గురించి కొద్ది నెలలుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు వేర్వేరు టీకాలను రెండు డోసులుగా తీసుకోవడం వల్ల ఎక్కువ రక్షణ ఉంటుందనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇద్దరు దేశాధినేతలు అలా వేయించుకోవడంతో ఆ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఇప్పటికే పలు అధ్యయనాలు జరిగాయి, జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టీకాల కొరత ఉన్న నేపథ్యంలో కూడా మిక్స్‌డ్‌ డోసు టీకాలపై చర్చ జరుగుతోంది. సాధారణంగా టీకాలను రకరకాల విధానాల్లో తయారుచేస్తారు. 

Updated Date - 2021-06-24T09:07:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising