ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘన్‌కు అమెరికా వల్ల ఘోరమైన చిక్కులు : చైనా

ABN, First Publish Date - 2021-08-17T22:35:55+05:30

ఆఫ్ఘనిస్థాన్‌ను అమెరికా ఘోరమైన సమస్యల్లోకి నెట్టిందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : ఆఫ్ఘనిస్థాన్‌ను అమెరికా ఘోరమైన సమస్యల్లోకి నెట్టిందని చైనా ఆరోపించింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మంగళవారం మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో అనిశ్చితి, విభజన, చితికిన కుటుంబాలు మిగిలాయని, వీటన్నిటితో కూడిన అత్యంత భయానకమైన సమస్యలను అమెరికా వదిలి వెళ్లిందని అన్నారు. 


హువా చున్యింగ్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా అత్యంత భయానకమైన సమస్యలను సృష్టించిందన్నారు. అనిశ్చితి, విభజన, చితికిన కుటుంబాలు మిగిలాయన్నారు. అమెరికా బలం విధ్వంసమేనని, దాని పాత్ర విధ్వంసంలోనే ఉంటుందని, నిర్మాణంలో కాదని చెప్పారు. అంతర్జాతీయ శక్తులతో స్పష్టంగా తెగదెంపులు చేసుకోవాలని నూతన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. మరోసారి ఉగ్రవాదులు, అతివాదులు పోగుబడే చోటుగా ఆఫ్ఘనిస్థాన్‌ను మార్చకుండా నిరోధించాలన్నారు. 


దాదాపు 76 కిలోమీటర్ల మేరకు చైనా-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు కలిసి ఉంటాయి. దీంతో ఆఫ్ఘనిస్థాన్ వీఘర్ ముస్లిం వేర్పాటువాదులకు ఆశ్రయం ఇస్తుందేమోనని చైనా ఆందోళన చెందుతూ ఉండేది. కానీ ఇటీవల తాలిబన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలిసింది. ఆఫ్ఘనిస్థాన్‌ను ఉగ్రవాదులకు కేంద్రంగా వినియోగించేందుకు అవకాశం ఇవ్వబోమని చైనాకు హామీ ఇచ్చింది. దీనికి ప్రతిఫలంగా ఆఫ్ఘనిస్థాన్ పునర్నిర్మాణానికి ఆర్థిక మద్దతును ఇస్తామని చైనా తెలిపింది. 


హువా సోమవారం మాట్లాడుతూ, తాలిబన్ నియంత్రణలోని ఆఫ్ఘనిస్థాన్‌తో స్నేహపూర్వక, సహకార సంబందాలను కొనసాగిస్తామన్నారు. 


Updated Date - 2021-08-17T22:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising