ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్ కోసం భారత్‌కు అమెరికా అదనపు నిధులు

ABN, First Publish Date - 2021-07-29T01:56:28+05:30

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత పటిష్టంగా అమలు చేయడం కోసం అమెరికా అదనపు నిధులను ప్రకటించింది. భారత్-అమెరికా డెలిగేషన్ లెవెల్ చర్చల అనంతరం బుధవారం అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం భారత దేశానికి అదనంగా 25 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం వల్ల భారత దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత పటిష్టమవుతుందని, తద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. 


వ్యాక్సిన్ సప్లయ్ చైన్ లాజిస్టిక్స్‌ను పటిష్టపరచడం, తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడం, వ్యాక్సిన్ వేయించుకోవడానికి సందేహించడం, మరింత ఎక్కువ మంది హెల్త్‌కేర్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం వంటివాటికి ఈ నిధులు ఉపయోగపడతాయని చెప్పారు. 


ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో మన దేశానికి అమెరికా అసాధారణమైన సహకారం అందించిందన్నారు. మన దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ముడి సరుకుల సరఫరాకు ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 


Updated Date - 2021-07-29T01:56:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising