ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాఖ్య ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల పాత్ర చాలా ముఖ్యం : మోదీ

ABN, First Publish Date - 2021-11-17T18:46:16+05:30

భారత దేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఓ వ్యవస్థ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా : భారత దేశంలో ప్రజాస్వామ్యం కేవలం ఓ వ్యవస్థ కాదని, అంతకన్నా ఎక్కువ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సమాఖ్య ప్రజాస్వామిక వ్యవస్థలో రాష్ట్రాల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 


భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తి కాబోతున్న తరుణంలో అంతకుముందు రానున్న 25 సంవత్సరాల్లో ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహించడమే ఓ మంత్రమని, ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఈ సందేశం పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల నుంచి వెలువడాలన్నారు. దేశ ఐకమత్యం, సమగ్రతలకు విఘాతం కలిగించే చర్యల పట్ల చట్ట సభలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. ఇతరులపై రాజకీయపరమైన అనుచిత వ్యాఖ్యలు లేకుండా, శ్రద్ధగా, హుందాతనంతో చట్టసభల్లో నాణ్యమైన, ఆరోగ్యకరమైన చర్చల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. చట్ట సభల సభ్యుల ప్రవర్తన భారతీయ విలువలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. 


82వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ సిమ్లాలో బుధవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-17T18:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising