ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డీఆర్‌డీవో’ కరోనా అస్త్రం వచ్చేసింది

ABN, First Publish Date - 2021-05-18T07:23:43+05:30

కరోనాపై పోరుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన ఔషధ అస్త్రం ‘2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌’ మార్కెట్లోకి విడుదలైంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కెట్లోకి 2-డీజీని విడుదల చేసిన రాజ్‌నాథ్‌, హర్షవర్ధన్‌

27కల్లా రెండో బ్యాచ్‌ ఔషధం

జూన్‌ నుంచి ఉత్పత్తి వేగవంతం

కొన్ని వారాల్లోనే దుకాణాల్లో.. 

ధరపై నిర్ణయం డాక్టర్‌ రెడ్డీ్‌సదే


న్యూఢిల్లీ, మే 17: కరోనాపై పోరుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సిద్ధం చేసిన ఔషధ అస్త్రం ‘2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్‌’ మార్కెట్లోకి విడుదలైంది. మోస్తరు నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్‌ కలిగిన కొవిడ్‌ రోగులకు నోటి ద్వారా అందించే ఈ ప్రభావవంతమైన ఔషధం మొదటి బ్యాచ్‌ను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం డీఆర్‌డీఓ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. భారత శాస్త్రవేత్తల ప్రతిభా పాఠవాలకు 2-డీజీ అభివృద్ధిని తార్కాణంగా రాజ్‌నాథ్‌ అభివర్ణించారు. ఇక ఈ ఔషధం రెండో బ్యాచ్‌ మే 27కల్లా పరిమిత సంఖ్యలో మార్కెట్లోకి విడుదలవుతుందని డీఆర్‌డీఓ చైర్మన్‌ జి.సతీశ్‌రెడ్డి వెల్లడించారు. జూన్‌ మొదటివారం నుంచి దీని ఉత్పత్తి ప్రక్రియ వేగాన్ని పుంజుకుంటుందని పేర్కొన్నారు. డీఆర్‌డీఓకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీ్‌సలు సంయుక్తంగా 2-డీజీని అభివృద్ధిచేశాయి. కొన్ని వారాల్లోనే రిటైల్‌ ఔషధ దుకాణాల్లో అందుబాటులోకి వస్తుందని ఐఎన్‌ఎంఏఎ్‌స డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ మిశ్రా తెలిపారు.  రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ కంపెనీయే సముచిత ధరను నిర్ణయిస్తుందన్నారు.

Updated Date - 2021-05-18T07:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising