ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్మోహన్‌కు లేని ఆ క్వాలిటీ మోదీకి ఉంది: శరద్ పవార్

ABN, First Publish Date - 2021-12-31T01:47:39+05:30

తన కెబినెట్‌ని ప్రధానమంత్రి కార్యాలయాన్ని అదుపు చేయడంలో మోదీకి ఒక భిన్న శైలి ఉంటుందని, అది మన్మోహన్‌లో తాను చూడలేదని పవార్ అన్నారు. ఇక బీజేపీతో పొత్తుపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు మహారాష్ట్రలో మరింత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేని ఒక విశిష్ణ లక్షణం నరేంద్రమోదీకి ఉందని, అదే ఆయన బలమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మోదీ ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు నిద్రపోరని అంతే కాకుండా ఆయన పని చేసే విధానం కూడా భిన్నంగా ఉంటుందని ఇది మన్మోహన్‌లో లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలోని పూణెలో లోక్‌సత్తా అనే మరాఠీ పత్రిక నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్ పాల్గొని ప్రసంగించారు.


‘‘ఆయన (మోదీ) ఏదైనా పని తన చేతుల్లోకి తీసుకుంటే పని ముగిసే వరకు చాలా అంకితభావంతో పని చేస్తారు. తను బయట ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్‌ను బాగా అదుపు చేస్తారు. అయితే పని విధానంలో నాణ్యత, ఉద్దేశాలు బాగా ఉండాలి. మోదీ తన పనులు అనుకున్నవి అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కానీ నాణ్యత, ఉద్దేశాల విషయంలో పెద్ద లోపం ఉంది. సాధారణ ప్రజల ఆంకాక్షలను అవి ప్రతిఫలించడం లేదు’’ అని పవార్ అన్నారు.


తన కెబినెట్‌ని ప్రధానమంత్రి కార్యాలయాన్ని అదుపు చేయడంలో మోదీకి ఒక భిన్న శైలి ఉంటుందని, అది మన్మోహన్‌లో తాను చూడలేదని పవార్ అన్నారు. ఇక బీజేపీతో పొత్తుపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు మహారాష్ట్రలో మరింత విస్తృతంగా అమలు చేయడానికి బీజేపీతో చేతులు కలపమని మోదీ తనను కోరినట్లు చెప్పుకొచ్చారు. అయితే మోదీ ప్రతిపాదనను తాను తిరస్కరించానని పవార్ అన్నారు.

Updated Date - 2021-12-31T01:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising