ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీరులో ఉగ్ర దాడి... ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టీచర్లు...

ABN, First Publish Date - 2021-10-07T23:39:14+05:30

జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో సంగం ఈద్గా ప్రాంతంలో గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్‌లో సంగం ఈద్గా ప్రాంతంలో గురువారం ఉదయం ఓ ప్రభుత్వ పాఠశాల వద్ద ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కశ్మీరులో మైనారిటీ మతాలవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 


జమ్మూ-కశ్మీరు పోలీసు అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, గురువారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో శ్రీనగర్‌లోని సంగం ఈద్గా ఏరియాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి  ఉగ్రవాదులు చొరబడి, కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కాల్పుల్లో ప్రిన్సిపాల్ సుపుందర్ కౌర్, టీచర్ దీపక్ చంద్ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, ఉగ్రవాదుల కోసం గాలింపు జరుగుతోందని చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో ఈ పాఠశాలలో విద్యార్థులు లేరని, తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని తెలిపారు.


శ్రీనగర్, బందిపొరలలో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ప్రముఖ ఫార్మసిస్ట్ మఖన్ లాల్ బింద్రూ కూడా ఉన్నారు. శ్రీనగర్ మేయర్ మాట్లాడుతూ, ఓ రోడ్డుకు బింద్రూ పేరు పెడతామని చెప్పారు. 


కశ్మీరులోని మైనారిటీలపై ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీపక్ చంద్ ఓ హిందూ అని, సుపుందర్ కౌర్ ఓ సిక్కు అని ఆ పాఠశాలలోని ఓ టీచర్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.  ఉగ్రవాదులు ఈ పాఠశాలలోకి చొరబడి, అక్కడ ఉన్నవారి ఐడెంటిటీ కార్డులను అడిగారని, మైనారిటీలైన హిందూ, సిక్కు మతాలకు చెందినవారిని దారుణంగా కాల్చి చంపారని చెప్పారు.


Updated Date - 2021-10-07T23:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising