ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai నుంచి ఢిల్లీ వచ్చిన 10 మందికి ఒమైక్రాన్

ABN, First Publish Date - 2021-12-22T16:57:34+05:30

దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన 10 మంది ప్రయాణికులకు ఒమైక్రాన్ వేరియంట్ కరోనా సోకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చిన 10 మంది ప్రయాణికులకు ఒమైక్రాన్ వేరియంట్ కరోనా సోకింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మొత్తం 57 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రయాణికులు విదేశాల నుంచి ఢిల్లీకి వచ్చిన వారికి కరోనా వచ్చింది. దుబాయ్ దేశం నుంచి వచ్చిన 10మందికి ఒమైక్రాన్ అని తేలింది. దీంతో పాటు యూకే నుంచి వచ్చిన నలుగురికి, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి, టాంజానియా నుంచి వచ్చిన ఇద్దరికి, జింబాబ్వే నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడికి ఒమైక్రాన్ సోకింది. డిసెంబరు 5వతేదీన ఢిల్లీలో మొట్టమొదటి ఒమైక్రాన్ కేసు వెలుగుచూసింది. ఆయనను లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు.ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ గతంలో ఒమైక్రాన్ పేషెంట్‌కు గొంతునొప్పి, జ్వరం వచ్చిందని చెప్పారు.



రోగి శరీర నొప్పి, బలహీనతతో కూడా బాధపడుతున్నాడు. అయితే ఆక్సిజన్ స్థాయి తగ్గుదల నమోదు కాలేదు.బుధవారం ఉదయం నాటికి భారతదేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 213కి పెరిగింది. మహారాష్ట్ర,ఢిల్లీ వరుసగా 65,57 ఒమైక్రాన్ కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. భారతదేశంలో ఒమైక్రాన్ వ్యాప్తి చెందడం వల్ల రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

Updated Date - 2021-12-22T16:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising