ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మూడు రాష్ట్రాల్లో కరోనా టీకాలు అధికంగా వృథా అవుతున్నాయి: కేంద్రం

ABN, First Publish Date - 2021-03-18T01:14:57+05:30

కరోనా టీకాను వృథా చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేవ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకాను వృథా చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం నాడు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 6.5 శాతం కరోనా టీకాలు వృథా అవుతున్నాయని పేర్కొంది. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణాలో కరోనా టీకా వృథా శాతం 17.6 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 11.6 శాతం. ఉత్తరప్రదేశ్‌లో 9.4 శాతం వృథా అయిపోతోంది. కాగా.. ఈ విషయంలో 10 శాతం టీకాల డోసులు నిరుపయోగంగా మారినా అభ్యంతరం ఉండదని కేంద్రం నిబంధనలు చెబుతున్నాయి. 


ఒక్కో టీకా వయల్‌లో నిర్దేశిత డోసులు అందుబాటులో ఉంటాయి. వయల్ తెరిచిన రెండు గంటల్లోగా టీకాను వినియోగించాల్సి ఉంటుంది. టీకా నిల్వ, రవాణా సందర్భంగా లోపాలు తలెత్తితే టీకా వయల్స్ నిరుపయోగంగా మారిపోయే ప్రమాదం ఉంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేడు ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాల సీఎంలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీకా కార్యక్రమాన్ని నిర్వహించడంలో మంచి ప్రగతి సాధిస్తున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలపై ప్రధాని మోదీ ప్రసంశల వర్షం కురిపించారు.

Updated Date - 2021-03-18T01:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising