ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘర్ వాపసీ వ్యాఖ్యలపై బీజేవైఎం చీఫ్ తేజస్వీ సూర్య యూటర్న్

ABN, First Publish Date - 2021-12-27T22:46:57+05:30

హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధినేత, ఎంపీ తేజస్వీ సూర్య ప్రకటించారు. తేజస్వీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధినేత, ఎంపీ తేజస్వీ సూర్య ప్రకటించారు. తేజస్వీ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. డిసెంబర్ 25న కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో ఉన్న శ్రీ క్రిష్ణ మఠ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడుతూ ‘‘హిందుత్వం నుంచి బయటికి వెళ్లి వేరే మతాల్లో చేరిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం మాత్రమే మనముందుకు ఏకైక మార్గం. ప్రతి గుడి ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఈ టార్గెట్‌ను పూర్తి చేయాలి’’ అని తేజస్వీ అన్నారు. అయితే బీజేపీ నేతలు ఘర్ వాపసీ (హిందూ మతంలోకి మారడం) గురించి తరుచూ చర్చిస్తున్న విషయం తెలిసిందే. తేజస్వీ మాటలు కూడా ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. అయితే ఇందులోకి మందిరాలను లాగడంపై తేజస్వీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తేజస్వీ ప్రకటించారు.

Updated Date - 2021-12-27T22:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising