ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నితీష్ కుమార్‌పై విరుచుకుపడ్డ తేజస్వీ

ABN, First Publish Date - 2021-01-16T22:02:17+05:30

బుధవారం బిహార్ రాజధానిలో పాట్నాలో ఉన్న ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తేజస్వీ మాట్లాడుతూ ‘‘దేశంలో నేరాలకు బిహార్ రాజధానిగా మారుతోంది. రోజు రోజుకూ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బిహార్‌లో రోజు రోజుకూ నేరాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయని, అయినా ముఖ్యమంత్రి నితీష్ ఏం చేయలేకపోతున్నారని బిహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ సీనియర్ నాయకుడు  తేజస్వీ యాదవ్ అన్నారు. నితీష్ నిస్సహాయ ముఖ్యమంత్రని, రిటైర్డ్ ముఖ్యమంత్రి ఆయన ఎద్దేవా చేశారు. అధికారంలో కూర్చొని నేరాల్ని కట్టడీ చేస్తూ నేరస్తులను శిక్షించాల్సింది పోయి.. అదే నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారని, కాపాడుతూ వస్తున్నరని తేజస్వీ ఆరోపించారు.


బుధవారం బిహార్ రాజధానిలో పాట్నాలో ఉన్న ఆర్జేడీ ప్రధాన కార్యాలయంలో తేజస్వీ మాట్లాడుతూ ‘‘దేశంలో నేరాలకు బిహార్ రాజధానిగా మారుతోంది. రోజు రోజుకూ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. శుక్రవారం ముఖ్యమంత్రి నితీష్‌ని చూసినప్పుడు హాస్యాస్పదంగా అనిపించింది. ఆయన చాలా బలహీనంగా, నిస్సహాయంగా కనిపించారు. నేరాలు ఎప్పుడు ఆగిపోతాయి? ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు? అంటూ మీడియా సరైన ప్రశ్నలే అడిగింది. కానీ మీడియాకు నేరుగానే సీఎం బెదిరింపులు చేస్తున్నారు. పోలీసులను నిరుత్సాహ పరుచొద్దని ఆయన అంటున్నారు. అధికారంలో కూర్చున్న వారు నేరాలను అరికట్టడానికి బదులు నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారు’’ అని అన్నారు.

Updated Date - 2021-01-16T22:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising