ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నాడీఎంకే బిగ్ షాక్.. కూటమికి నుంచి వైదొలిగిన విజయ్‌కాంత్

ABN, First Publish Date - 2021-03-09T19:26:14+05:30

అధికార పార్టీ అన్నాడీఎంకే కూటమి బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం) అధినేత విజయ్ కాంత్ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: అధికార పార్టీ అన్నాడీఎంకే కూటమి బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు, డీఎండీకే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం) అధినేత విజయ్ కాంత్ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. పార్టీల నేతలతో సమావేశమైన తర్వాత విజయ్‌కాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటుపై జరిపిన చర్చలు విఫలంకావడంతో విజయ్ కాంత్ అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. 23 అసెంబ్లీ, ఒక రాజ్యసభ సీటు కోసం విజయ్ కాంత్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కేవలం 13 అసెంబ్లీ సీట్లు మాత్రమే ఇస్తామని చెప్పడంతో విజయ్‌కాంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంచేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎండీకే ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకే కూటమి వర్గాల్లో కలకలం రేగింది. 



Updated Date - 2021-03-09T19:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising