కొత్త డీజీపీ ఎవరో?
ABN, First Publish Date - 2021-06-29T13:22:14+05:30
రాష్ట్ర కొత్త డీజీపీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఐసీఎస్ అధికారుల్లో సీనియర్ కావడం, గతంలో తీసుకున్న నిర్ణయాలు, డీఎంకే ప్రభుత్వంతో వున్న సత్సంబంధాలు తదితరాల న్నింటినీ పరిశీలిం
- కేంద్రప్రభుత్వంతో రాష్ట్ర అధికారుల సమావేశం
- ఒకట్రెండు రోజుల్లో వీడనున్న ఉత్కంఠ
చెన్నై: రాష్ట్ర కొత్త డీజీపీ నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఐసీఎస్ అధికారుల్లో సీనియర్ కావడం, గతంలో తీసుకున్న నిర్ణయాలు, డీఎంకే ప్రభుత్వంతో వున్న సత్సంబంధాలు తదితరాల న్నింటినీ పరిశీలించి చూస్తే డీజీపీ శైలేంద్రబాబు నియా మకం ఖాయమని స్పష్టమవుతున్నా, ఆఖరి నిముషంలో ఒకటీరెండు పేర్లు తెరపైకి రావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర డీజీపీ పదవి అత్యంత కీలకమైనది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ ఆయన ఆధీనంలోనే ఉంటుంది. ప్రస్తుత డీజీపీగా ఉన్న జేకే త్రిపాఠి ఈనెల 30వ తేదీ పదవీవిరమణ చేయనున్నారు. సాధారణంగా కేంద్రప్రభుత్వ అధికారులు 60 ఏళ్లకు పదవీవిమరణ చేస్తారు. అయితే లా అండ్ ఆర్డర్ డీజీపీలు మాత్రం కనీసంగా రెండేళ్లు పనిచేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుత డీజీపీ త్రిపాఠి 60 ఏళ్లు దాటినా విధులు నిర్వహిస్తున్నారు. గత మాసంలో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో, కొత్త డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ అధికారుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల కమిషన్‌కు పంపాల్సి వుంటుంది. ఆ జాబితాలోని వారివివరాలను పరిశీలించిన కేంద్రం... ముగ్గురిని సిఫారుసు చేయగా, వారిలో ఒకరిని రాష్ట్రప్రభుత్వం ఖరారు చేస్తుంది. ఆ ప్రకారం, రాష్ట్రంలో పని చేస్తున్న 11 మంది సీనియర్ అధికా రులతో కూడిన జాబితాను రాష ్ట్రప్రభుత్వం కేంద్రానికి పంపింది. జాబితాలో, శైలేంద్రబాబు, కరణ్‌సిన్హా, ప్రదీప్ వి.ఫిలిప్, సునీల్‌కుమార్ సింగ్, కందస్వామి, షకీల్ అఖ్తర్, ప్రమోద్ కుమార్, రాజేష్‌దాస్, రవి, శంకర్ జివాల్, ఏకే విశ్వనాథన్‌తో కూడిన 11 మంది పేర్లున్నాయి. వీరిలో శైలేంద్ర బాబు నుంచి రవి వరకు 9 మంది డీజీపీ హోదాలో, శంకర్ జివాల్, ఏకే విశ్వనాథన్‌లు అదనపు డీజీపీ హోదాలో వున్నారు. రాజేష్‌దాస్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో వున్నారు. దీంతో మిగిలిన 8మందిలో ఒకరిని డీజీపీగా నియమించాల్సి వుంది. కొత్త డీజేపీ ఎంపికపై సోమ వారం ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైఅన్బు, హోంశాఖ ముఖ్యకార్యదర్శి ప్రభాక రన్, డీజీపీ త్రిపాఠి పాల్గొన్నారు. సాధారణంగా సీనియారిటీ ప్రకారం డీజీపీ ఎంపిక జరుగుతుంది. ఆ ప్రకారం త్రిపాఠి తర్వాత సీనియారిటీ జాబితాలో 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారులైన నిఖిలేష్ కుమార్ ఝా, శైలేంద్రబాబు, కరణ్‌సిన్హా, ప్రదీప్ వి.ఫిలిప్ ఉన్నారు. వీరిలో 60 ఏళ్లు పూర్తయి నిఖిలేష్ కుమార్ ఝా జూలైలోనూ, ప్రదీప్ వి.ఫిలిప్ సెప్టెంబరులో పదవీ విరమణ చేయనుండగా, శైలేంద్రబాబు, కరణ్ సిన్హా వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. అలాగే, సంజయ్ అరోరా కేంద్రప్రభుత్వ విధుల్లో ఉన్నారు. కందస్వామికి మరో రెండేళ్లు ఉన్నాయి. ఒకవేళ ముగ్గురి పేర్లను కేంద్రం సిఫారసు చేయాల్సి వస్తే, సీనియారిటీ ప్రకారం శైలేంద్రబాబు, కరణ్‌సిన్హా, సంజయ్ అరోరా ఉన్నారు. సంజయ్ అరోరా 1988లో విధుల్లో చేరారు. చెన్నై పోలీసు శాఖలో పలు ఉన్నత పదవుల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం కేంద్ర రిజర్వ్ పోలీసు విభాగం ప్రత్యేక డీజీపీగా కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే డీజీపీ శైలేంద్రబాబు, అగ్నిమాపక శాఖ డీజీపీ కరణ్‌సిన్హా, సంజయ్ అరోరాలలో ఒకరు కొత్త డీజీపీగా ఎంపికయ్యే అవకాశముంది. ఒకవేళ కేంద్రప్రభుత్వ ఐదుగురు పేర్లను సిఫారసు చేస్తే, జాబితాలో సునీల్‌కుమార్ సింగ్, కందస్వామి కూడా చోటుచేసుకునే అవకాశముంది. అదే సమయంలో సునీల్‌కుమార్ సింగ్ అన్నాడీఎంకే ప్రభుత్వానికి మద్దతుదారుడిగా ఉన్నారనే ఆరోపణలున్నా యి. ప్రస్తుతం ఆయన జైళ్ల శాఖ డీజీపీగా కొనసాగుతు న్నారు. అందువల్ల ఆయన పేరు జాబితాలో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ కేంద్రప్రభుత్వం ముగ్గురి పేర్లు సిఫారసు చేస్తే, ఆ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి ఉండగా, అదే సమయంలో ప్రభుత్వం తనకు నచ్చిన వ్యక్తిని డీజీపీగా నియమించుకొనే అవకాశమూ ఉంది. దీంతో డీజీపీ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అత్యధిక అవకాశాలు శైలేంద్రబాబుకే వున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2021-06-29T13:22:14+05:30 IST