ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరానికి 85 వేల కొవాగ్జిన్‌ టీకాలు

ABN, First Publish Date - 2021-06-11T16:05:32+05:30

రాష్ట్రప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిన 85 వేల కోవాగ్జిన్‌ టీకాలు రాజధాని నగరానికి చేరినట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ప్రక టించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా మహ మ్మారి ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిన 85 వేల కోవాగ్జిన్‌ టీకాలు రాజధాని నగరానికి చేరినట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ప్రక టించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది.  ప్రజల్లో టీకా వేయించుకోవడంపై ఆసక్తి పెరిగడం, కార్పొరేషన్‌ సహకారంతో నగరంలోని పలు స్వచ్ఛంధ సంస్థలు ఉచిత వ్యాక్సిన్‌ శిబిరాలు నిర్వహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో టీకాలకు డిమాండ్‌ నెలకొంది. 36 జిల్లాల్లో టీకాలు స్టాకు లేక ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను  తాత్కాలికంగా నిలిపివేసింది. ఒకవైపు కేంద్రప్రభుత్వం, మరోవైపు వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు వ్యాక్సిన్‌ సరఫరాను నిలిపివేయడంతో రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడిందని ఆరోగ్యశాఖ అధికారులు కారణం చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆగిపోవడంతో స్పందించిన ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న వ్యాక్సిన్‌ తయారీ సంస్థకు  లేఖ రాసింది. ఆ మేరకు ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిన 80 వేల కొవాగ్జిన్‌ డోసులు గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విమానం ద్వారా చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా, వాటిని ఆరోగ్యశాఖ అధికారులు తేనాం పేటలో ఉన్న డీఎంఎస్‌ కార్యాలయానికి తరలించి భద్రపరిచారు. శుక్రవారంలోగా ఈ వ్యాక్సిన్లు అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నారు.

Updated Date - 2021-06-11T16:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising